పేద ప్రజలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యంలో కొంతమంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెంలో డీలర్ తూకాన్ని తగ్గించి 20 కిలోల బియ్యానికి 14 కిలోలు మాత్రమే ప్రజలకు అందిస్తున్నాడు. గమనించిన వార్డు వాలంటీర్ రమేష్ అనే వ్యక్తి డీలర్‌ను ప్రశ్నించాడు. వెంటనే డీలర్, అతని బంధువులు రమేష్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం డీలర్ అవకతవకలకు పాల్పడుతున్నాడని రొంపిచర్ల పోలీస్ స్టేషన్, తహసీల్దార్‌కు వాలంటీర్ ఫిర్యాదు చేశారు.
అవకతవకలను ప్రశ్నించిన వాలంటీర్‌పై రేషన్ డీలర్ దాడి - latest news on rice manipulations in konakanchivaripalem
రాష్ట్రంలో కరోనాతో నిరుపేదల ఆకలి కేకలు వేస్తుంటే... వారి కడుపు నింపేందుకు ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది.ఇదే అదునుగా కొంతమంది రేషన్ డీలర్లు అవకతవకలకు తెరలేపారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా కొనకంచివారిపాలెంలో జరిగింది.
కొనకంచివారిపాలెంలో అవకతవకలకు పాల్పడుతోన్న డీలర్