గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని సతీష్ నర్సింగ్ హోమ్‌లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 35 ఏళ్ళ మహిళ కడుపు నొప్పితో అస్పత్రికి రాగా డా. కొల్లా ప్రశాంతి పరీక్షలు జరిపి గర్భసంచికి ఆనుకుని ఎనిమిది కిలోల కణితి ఉన్నట్టు గుర్తించారు. సీనియర్ సర్జన్ డాక్టర్ కొల్లా రామారావు పర్యవేక్షణలో వైద్యులు బాధిత మహిళకు ఆపరేషన్ చేసి.. 8 కిలోల బరువున్న కణితిని బయటకు తీశారు.
మహిళ కడుపులో 8 కిలోల కణితిని తొలగించిన వైద్యులు - గుంటూరు జిల్లాలో అరుదైన శస్త్ర చికిత్స
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ ప్రైవేటు వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చిన ఓ మహిళను పరీక్షించిన వైద్యులు కడుపులో ఎనిమిది కిలోల కణితి ఉన్నట్లు గుర్తించి.. ఆపరేషన్ చేసి బయటకు తీశారు.
ప్రైవేటు ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స