గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు... అరుదైన శస్త్ర చికిత్స చేసినట్టు చెప్పారు. ఓ మహిళ తుంటి ఎముకకు వచ్చిన గడ్డను తొలగించి దాని స్థానంలో టైటానియంతో తయారు చేసిన ఎముకను అమర్చినట్లు తెలిపారు. రోగి తుంటి కటివలయానికి కేన్సర్ పూరితమైన గడ్డతో పాటుగా ఎముకను సైతం తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గడ్డ ఉన్న అర్థకటి వలయాన్ని తొలగించి దాని స్థానంలో 3డి సహాయంతో జర్మనీలో తయారు చేసిన టైటానియం కటివలయాన్ని అమర్చినట్లు వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సకు అవసరమైన నిధులను ఆసుపత్రి భరించిందని కోశాధికారి అక్కినేని మణి చెప్పారు. ఇలాంటి శస్త్ర చికిత్స.. దేశంలోనే మొదటిసారిదన్నారు.
ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో.. దేశంలోనే అరుదైన చికిత్స - rare operation
గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. తుంటి ఎముకకు ఏర్పడిన గడ్డను తొలగించి దాని స్థానంలో జర్మనీలో తయారు చేసిన టైటానియం కటి వలయాన్ని 3డి సహాయంతో అమర్చారు.

'దేశంలోనే తొలిసారి నిర్వహించిన శస్త్ర చికత్స'
'దేశంలోనే తొలిసారి నిర్వహించిన శస్త్ర చికత్స'
ఇదీ చూడండి: