అభం శుభం తెలియని 10 ఏళ్ల బాలికపై 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో చోటు చేసుకుంది. కొత్తమాసు మరియానందం(48) అనే వ్యక్తి ఇంటికి బాలిక టీవీ చూసేందుకు వచ్చింది. ఆ బాలికపై కన్నేసిన మరియానందం.. రాక్షసుడిలా మారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. వాళ్ళు వచ్చిన తరువాత బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు నకరికల్లు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు మరియానందంపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పదేళ్ల చిన్నారిపై 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారం - rape news in guntur
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో దారుణం చోటు చేసుకుంది. 10 ఏళ్ల చిన్నారిపై 48 ఏళ్ల వ్యక్తి కీచకుడిలా మారి అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
10 ఏళ్ల చిన్నారిపై 48 ఏళ్ల వ్యక్తి అత్యాచారం