గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఐదేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం ( rap case at Pedakakani Police Station) చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సుబాని అనే వృద్ధుడిని పోలీసులు అరెస్ట్(Rape Case Under Pedakakani Police Station) చేశారు.
బడ్డీ కొట్టు పెట్టుకొని, పిల్లలు తినే చిరుతిళ్లు అమ్ముతున్న సుబాని.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐదేళ్ల బాలిక.. చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కోవడానికి రోజూ సుబాని బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దుకాణం వద్దకు వెళ్లిన బాలికకు.. చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.