గుంటూరు జిల్లా రామిరెడ్డినగర్లో ఓ మృగాడు రెచ్చిపోయాడు. ఐదేళ్ల బాలికపై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్మారెడ్డి (18) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి కింద ఉండే యువకుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని నగరంపాలెం సీఐ వీరా రెడ్డి తెలిపారు. పాప కడుపులో నొప్పిగా ఉందని వాళ్ళ అమ్మకి చెప్పగా... ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగినట్లుగా వైద్యులు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని... నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. పాపను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఐదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం - rape attemted by five years girl in guntur
ఎన్ని చట్టాలు చేసినా.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. తాజాగా గుంటూరులో అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
ఐదేళ్లబాలికపై యువకుడు అత్యాచారం
Last Updated : Dec 13, 2019, 7:44 PM IST