బాలిక (11)పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. సదరు యువకుడికి బాధితురాలు సోదరి అన్న స్పృహ లేకుండా యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరలో జరిగింది.
గ్రామానికి చెందిన చిలకా షడ్రక్.. అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో, నిర్భయ కేసులు నమోదు చేసినట్లు సత్తెనపల్లె గ్రామీణ సీఐ వెల్లడించారు.