గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర శివారులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై దుండుగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడికొండ మండల పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న యువతి తన స్నేహితునితో కలిసి గుంటూరుకు బయల్దేరింది. వారు రోడ్డు పక్కన కాసేపు ఆగగా...ఆ సమయంలో కొందరు యువకులు వచ్చి వారిపై కర్రతో దాడి చేశారు. యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. యువతి కేకలు వేయటంతో నిందితులు పరారయ్యారు.
Rape Attempt: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం...అంతలోనే.. - ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం
17:33 October 22
ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం
జరిగిన ఘటనపై బాధిత యువతి, ఆమె స్నేహితులు ఇవాళ తాడికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు..బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తాడికొండ ఎస్సై స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
Last Updated : Oct 22, 2021, 6:11 PM IST