తన ఇంటిని అక్రమంగా కూల్చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన లింగమనేని రమేష్‌పై గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఆయన ఇంటికి ఎలాంటి అనుమతులు లేవనీ.. ఉండవల్లి గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి పన్ను కట్టలేదని ఆర్కే తెలిపారు. లింగమనేని రమేష్ తన ఇంటిని చంద్రబాబుకు ఇస్తే.. అదే ఇంటిపై ప్రభుత్వం నుంచి అద్దె ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. లింగమనేనికి సంబంధించిన అన్ని భవన సముదాయాలలో జరిగిన అక్రమాలను త్వరలోనే బయట పెడతానన్నారు. లింగమనేని రాసిన లేఖపై ఉన్న సంతకం.. గతంలో రాసిన లేఖపై సంతకాలలో తేడాలున్నాయనీ.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు: ఆర్కే - rk fires on lingamaneni ramesh
తన ఇంటిని కూల్చేస్తున్నారంటూ సీఎం జగన్‌కు లింగమనేని రమేష్ రాసిన లేఖపై ఆర్కే స్పందించారు. లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి