రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చటం హేయమైన చర్య అని మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో 'మూడు రాజధానులు వద్దు- ఒక రాజధాని ముద్దు' అనే నినాదంతో గుంటూరు జిల్లా పొన్నూరులో ర్యాలీ నిర్వహించారు. రాజధాని మార్పు ప్రతిపాదన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలమే అని చెప్పి... నేడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని విమర్శించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
'అప్పుడు ఒప్పుకొని.. ఇప్పుడు తప్పిస్తున్నారు' - అమరావతిపై ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పందన
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అనుకూలమని చెప్పి... ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానులు పెడతామంటూ సీఎం జగన్ మాట్లాడుతున్నారని.. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

పొన్నూరులో ర్యాలీ