ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బ్యాంకుల ముందు చెత్త వేయటం హేయమైన చర్య' - meeting in guntur district

బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘనటపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

rajyasabha member GVL narasimharao fire on garbage drop in front of banks in krishna district
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

By

Published : Dec 26, 2020, 5:36 PM IST

కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త వేయటం హేయమైన చర్య అని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని సుగంధ ద్రవ్యాల బోర్డులో అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన... ఇలాంటి చర్యలకు ప్రోత్సాహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు. సమస్యలుంటే బ్యాంకు అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప.. ఇలాంటి పనులు చేయకూడదని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details