ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్​ను సందర్శించిన జీవీఎల్ - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్​ను సందర్శించిన జీవీఎల్

బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్​ను... మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సందర్శించారు. సంస్థ తరపున అభివృద్ధి చేసిన మిరప రకాలను ఆయన పరిశీలించారు.

rajyasabha member gvl narasimha rao visits indian institute of horticulture in bangalore
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్​ను సందర్శించిన జీవీఎల్ నరసింహరావు

By

Published : Nov 2, 2020, 11:13 PM IST

మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్​ను సందర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడి సీనియర్ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. సంస్థ తరపున అభివృద్ధి చేసిన మిరప రకాలను పరిశీలించారు.

ఆకుముడత తెగులు తట్టుకునేవి, అధిక దిగుబడులను ఇచ్చే మిర్చి రకాలు వీటిలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆకుముడత తెగులు ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోతుండటంతో... అలాంటి వాటిని సాగు చేసేలా సహకరించాలని కోరారు. ఐఐహెచ్ఆర్ చేపడుతున్న పరిశోధన, ఇతర కార్యకలాపాల గురించి చర్చించారు. రాష్ట్రంలో మిర్చి రైతుల ఆదాయం రెట్టింపు చేయటానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details