ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అందరికీ ఆదర్శంగా ఉండాలనే కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకున్నా' - tdp senior leader yedlapati venkatarao news

రాజ్యసభ మాజీ సభ్యుడు, తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కొవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకున్నట్లు తెలిపారు. 102 ఏళ్ల వయసున్న ఆయన.. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో టీకా తీసుకున్నట్లు చెప్పారు.

ex minister yadlapati venkatrao
రాజ్యసభ మాజీ సభ్యుడు, తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు

By

Published : Apr 2, 2021, 10:40 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలో రాజ్యసభ మాజీ సభ్యుడు, తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కరోనాపై మాట్లాడారు. ఇటీవల డీవీసీ ఆసుపత్రిలో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. 102 ఏళ్ల వయసులోనూ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతోనే వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details