గుంటూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్, పలు పాఠశాలల వద్ద జొన్నలగడ్డ రాజమోహనరావు ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఆరేళ్లుగా తన సొంత ఖర్చుతో... ద్విచక్రవాహనంపై తిరుగుతూ... దాహార్తులకు చల్లని నీరు అందిస్తున్నాడు. రాజమోహనరావు గుంటూరులోని ఓ గ్యాస్ కంపెనీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తనకొచ్చే కొద్ది నగదుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంపై పలువురు ప్రభుత్వాధికారులు, నగరవాసులు రాజమోహనరావును అభినందిస్తున్నారు. నేటి యువతకు ఆయన ఆదర్శమంటూ కొనియాడుతున్నారు.
అందరికీ ఆదర్శం... ఈ ''జలదాత'' - గుంటూరు
మండే వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు... ప్రత్యక్షం అవుతోంది ఓ మొబైల్ చలివేంద్రం. తాను అనుభవించిన బాధ ఇతరులకు కలగకుండా... సొంత వాహనంపై గుంటూరు నగరంలోని తిరుగుతూ... వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజల దాహం తీరుస్తున్నాడు ఓ సామాన్య వ్యక్తి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనంపై తిరుగుతూ... ప్రజలకు చల్లని తాగునీరు అందిస్తున్నారు రాజమోహనరావు.
![అందరికీ ఆదర్శం... ఈ ''జలదాత''](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3146370-765-3146370-1556604268669.jpg)
మొబైల్ చలివేంద్రం