రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 122వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం, వెంకటపాలెం, దొండపాడులో రైతులు, మహిళలు దీక్షను కొనసాగించారు. అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ తమ ఇళ్ల వద్దనే ఆందోళన చేపట్టారు.
భౌతిక దూరం పాటిస్తూ అమరావతి దీక్షలు - amaravathi farmers protest latest news
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 122వ రోజు ఆందోళనలు కొనసాగించారు. కరోనా నేపథ్యంలో రైతులు తమ ఇళ్ల వద్దే ఆందోళన నిర్వహించారు.
![భౌతిక దూరం పాటిస్తూ అమరావతి దీక్షలు భౌతిక దూరం పాటిస్తూ అమరావతి నినాదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6837900-309-6837900-1587184040583.jpg)
భౌతిక దూరం పాటిస్తూ అమరావతి నినాదాలు