Minister Sabita meets Governor: ఉమ్మడి నియామక బోర్డు ద్వారా.. నియామకాలు త్వరగా జరగాలన్నదే తన అభిమతమని.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని గవర్నర్ వెల్లడించారు. తమిళిసై అడిగిన సందేహాలను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి నివృత్తి చేశారు. యూజీసీ నిబంధనల అమలు, న్యాయపరమైన, రిజర్వేషన్ల అంశాలను.. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో గవర్నర్ ప్రస్తావించారు. అన్నింటినీ పూర్తిస్థాయిలో పాటిస్తున్నామని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. మంత్రి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందులపై గవర్నర్‌కు అధికారులు వివరించారు. కొత్త విధానం ద్వారా వచ్చే సౌలభ్యంపై వెల్లడించారు.
వర్సిటీల బిల్లుపై గవర్నర్ సందేహాలను నివృత్తి చేసిన సబిత - governor latest news
Minister Sabita meets Governor: నియామకాలు త్వరగా జరగాలన్నదే తన అభిమతమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడిగిన సందేహాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి నివృత్తి చేశారు. నిబంధలన్నింటినీ పూర్తిస్థాయిలో పాటిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు