ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం: సీఎం - ఏపీలో రైతు భరోసా కేంద్రాలు వార్తలు

లాక్​డౌన్​తో కష్టాలు పడుతున్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలు సహా వ్యవసాయ సలహా బోర్డులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

rbks
rbks

By

Published : May 2, 2020, 4:42 PM IST

మే 30న రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్దేశించారు. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటన్నింటిపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. జూన్‌ 6న మత్స్యకార భరోసా పథకం కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details