ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాం అంటే దెయ్యం కాదు' - గుంటూరులో రైతే రాజు వార్తలు

ఈనాం విధానం బలోపేతం చేయడం గురించి గుంటూరులో మార్కెటింగ్ శాఖ రైతే రాజు వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి పాల్గొన్నారు.

వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు తో మాట్లాడుతున్న మంత్రి మోపిదేవి

By

Published : Nov 1, 2019, 2:33 PM IST

Updated : Nov 1, 2019, 5:27 PM IST

ఈనాం విధానం బలోపేతం చేయటం, మధ్యవర్తుల నిర్మూలనపై గుంటూరులో మార్కెటింగ్ శాఖ నిర్వహించిన రైతే రాజు కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు. రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే ఈనాం విధానం సక్రమంగా అమలైననాడే లాభదాయకంగా ఉంటుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అసలు ఈనాం అంటే భూతంలా చూసే విధానం పోవాలని.... రైతులు తమ ఆలోచన మార్చుకోవాలని సూచించారు. రైతులు తాము ఏ పంట వేసేది ఈ క్రాప్ లో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు అందుకోవాలని సూచించారు. మార్కెటింగ్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో నియామకాలు చేపడతామన్నారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా చేసిన రోజే పంటలకు మెరుగైన ధరలు లభిస్తాయని కార్యశాలలో పాల్గొన్న వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి అన్నారు.

ఈనాం అంటే భూతంలా చూసే విధానం పోవాలి: మంత్రి మోపిదేవి
Last Updated : Nov 1, 2019, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details