గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. మిర్చి, పత్తి పొలాల్లో వర్షం నీరు భారీగా నిలిచింది. రహదారులపై వరద చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్లమడ వాగులో నీటి ఉద్ధృతి పెరిగింది. ఎగువ నుంచి వర్షపు నీరు భారీగా చేరుతున్నందున వాగులో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు తమ పొలాల్లోని నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం...నీట మునిగిన పంటలు - గుంటూరులో తాజా వర్షాలు
రాత్రి నుంచి కురిసిన వర్షంతో గుంటూరు జిల్లాలోని పలు మండలాలు తడిసి ముద్దయ్యాయి. మిర్చి, పత్తి పొలాల్లో వర్షం నీరు భారీగా వచ్చి చేరటంతోపాటు రహదారులు జలమయమయ్యాయి.
పలు మండలాల్లో భారీ వర్షం