నైరుతి రుతుపవనాలు మాల్దీవులు - కొమరిన్ ప్రాంతం, నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు ఆగ్నేయ బంగాళాఖాతం లోని అన్ని ప్రాంతాలలో ఈరోజు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 'యాస్' తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడి దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన వివరించిన ఆ శాఖ, ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలలో ఈరోజు, రేపు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు(Rains in AP) ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rains in AP: వాయుగుండంగా మారనున్న యాస్.. రాష్ట్రంలో మూడు రోజులు పాటు వర్షాలు - yas cyclone
యాస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులపాటు తేలికపాటి వర్షాలు(Rains in AP) కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు… నైరుతి ,తూర్పు మధ్య , పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. దక్షిణ ఝార్ఖండ్ దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న తుపాను రాగల 3 గంటలలో ఉత్తర దిశగా ప్రయాణించి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది.
రాష్ట్రంలో మూడు రోజులు పాటు వర్షాలు