ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తౌక్టే ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. అన్నదాతలకు తీవ్ర నష్టాలు - rain news

తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఈదురుగాలులకతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికాలు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18 న గుజరాత్​ తీరంలో తుపాను తీరం దాటవట్చని వారు స్పష్టం చేశారు.

rains at guntur district
తుపానుతో గుంటూరు జిల్లాలో పలుచోట్ల వర్షం

By

Published : May 16, 2021, 11:59 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

తౌక్టే తుపాను.. రాష్ట్రంపై ప్రభావం చూపిస్తోంది. కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 18న గుజరాత్ తీరంలో తౌక్టే తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

కృష్ణా జిల్లాలో..

విజయవాడలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరంలో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గన్నవరం, ఉంగుటూరు, వీరులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి ఎండబెట్టిన మొక్కజొన్న, జొన్న, వరి పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. స్థానిక చెన్నై - కోల్​కతా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

గుంటూరు జిల్లాలో..

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాలవర్షం కారణంగా జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఉదయం భారీ వర్షం కురిసింది. గంట సేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలిచిపోడంతో.. వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వర్షానికి సేద తీరారు.

ఇవీ చదవండి:

ఆదాయం లేకపోయినా.. పేదల ఆకలి తీరుస్తూ..

బెయిల్‌ పిటిషన్ : నేడు సుప్రీంను ఆశ్రయించనున్న ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details