గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా సగటున 50.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైనే నీరు నిలిచింది. అత్యధికంగా చుండూరులో 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చేబ్రోలు 193.2, తెనాలి 153.2, కొల్లిపర 146.4, వేమూరు 140.4, అమృతలూరు 140, దుగ్గిరాల132.6, వట్టిచెరుకూరు 127.4, పెదకాకాని 119, గుంటూరు 113, మంగళగిరి 98, ప్రత్తిపాడు 83.4, ఫిరంగిపురం 77.4, భట్టిప్రోలు 76.2, పొన్నూరు 72.4, తాడేపల్లి 70.4, పెదనందిపాడు 69.2, బాపట్ల 58.2, కాకుమాను 57.2, కొల్లూరు 49.6, రేపల్లె 46, చెరుకుపల్లి 40.4, నాదెండ్ల, తాడికొండ 37.2, మెడికొండూరు 36.8, చిలకలూరిపేట 28.6 మిమీ వర్షపాతం నమోదైంది.