అలుముకున్న నల్లని మేఘాలు..అమరావతిలో చీకట్లు
రాజధాని అమరావతి పరిసరాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. సచివాలయంలో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచింది. అకస్మాత్తుగా ఆవరించిన మేఘాలతో పరిసరాలన్నీ చీకటిమయంగా మారాయి. తుళ్లూరు, మంగళగిరి మండలాలతో పాటు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చాలా చోట్ల భారీ వర్షం కురిసింది.