రెండు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన - rain alert to ap news
రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.
తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది క్రమంగా రాగల 3 - 4 రోజుల్లో పశ్చిమ దిశగా... పశ్చిమ మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. అలాగే వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు (శని, ఆది) వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.