గుంటూరు జిల్లా అధికారులు.. కరోనాపై పోరుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే కరోనా సోకిన వారికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే.. రైల్వే శాఖ సహాయంతో.. కొన్ని బోగీలను ఐసోలేటెడ్ గా మారుస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే.. వీటిలో రోగులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఐసోలేషన్ వార్డులుగా రైల్వేకోచ్లు - live updates of corona virus in andhrapradesh
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులను వైద్య సేవలకు వినియోగించుకుంటోంది. ముందు జాగ్రత్త చర్యగా... రైల్వేకోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు.
రైల్వేకోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్పు