గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు తోపులాటకు దిగారు. కంటైన్మెంట్ జోన్లలో మద్యం దుకాణాలు లేకపోవటంతో.. గ్రీన్ జోన్లలో ఉన్న దుకాణాల వద్దకు ఎక్కువమంది తరలివస్తున్నారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలోని మద్యం దుకాణం వద్దకు మందుబాబులు భారీగా చేరుకున్నారు. మాస్కులు లేకుండా, కనీస భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం ఎగబడ్డారు.
మందుషాపుల ముందు మందుబాబుల తోపులాట - queue infront of liquor shop in guntur dist
కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతోంది. అయినా ఆ భయం మందుబాబులలో కనిపించటం లేదు. మద్యం దుకాణాలు ముందు తోపులాటలకు దిగుతూ మద్యం కోసం ఎగబడ్డారు. పోలీసులు పర్యవేక్షణ లేకపోవటం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

మందుషాపుల ముందు.. మందుబాబుల తోపులాటలు
పోలీసులు పర్యవేక్షణ లేకపోవటంతో ఒకరిపై ఒకరు పడుతూ తోసుకున్నారని స్థానికులంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మందుబాబులు వస్తుండటంతో స్ధానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెడ్ జోన్ల నుంచి జనం రాకుండా చూడాలని వారు కోరుతున్నారు.