ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ నుంచి క్షేమంగా.. 300 మంది ఇంటికి చేరగా! - గుంటూరులో ఎంతమంది క్వారంటైన్​ సెంటర్​ నుంచి ఇంటికి వెళ్లారు

కరోనా పరీక్షల్లో నెగటివ్​ వచ్చి క్వారంటైన్​ పూర్తి చేసుకున్న వాళ్లు ఇళ్లకు పయనమయ్యారు. గుంటూరు నుంచి దిల్లీ మర్కజ్​కు వెళ్లిన వారితో పాటు... పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న 16 వందల మందిని క్వారంటైన్​కు తరలించగా వారిలో 300 మందిని అధికారులు ఇళ్లకు పంపించారు.

క్వారంటైన్​ పూర్తి చేసుకుని 300మంది ఇళ్లకి పయనం
క్వారంటైన్​ పూర్తి చేసుకుని 300మంది ఇళ్లకి పయనం

By

Published : Apr 19, 2020, 4:09 PM IST

గుంటూరులో క్వారంటైన్ సెంటర్​లో ఉన్నవారిని ఇళ్లకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. దిల్లీలో మర్కజ్​కు వెళ్లిన వారితో పాటు... పాజిటివ్ వచ్చిన వారితో కలిసిన కారణంగా 16వందల మందికి పైగా క్వారంటైన్​కు తరలించారు. నిర్ధరణ పరిక్షల్లో నెగిటివ్ వచ్చి.... 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకున్న 300మందికి పైగా ఇళ్లకు పంపించారు. ప్రమాదం నుంచి తాము బయటపడ్డామని అంతా ఆనందించారు. తమకు చికిత్స అందించిన వైద్యులు, ఇతర సిబ్బందితో పాటు జిల్లా అధికారులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details