QATAR NRI TDP: ఖతార్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని ప్రశంసిస్తూ తమ మద్దతు తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నిధికి 10 లక్షల రూపాయలను, వైద్య సహాయార్థం 5.5 లక్షలు అందించారు. పార్టీ నిధికి మరియు కార్యకర్తల వైద్య సహాయానికి విరాళాల్ని అందించినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విరాళాన్ని అధినేత చంద్రబాబుకు ఖతార్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణ, ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్ నేతృత్వంలోని ప్రవాసీ ప్రతినిధి బృందం అందించింది.
ఖతార్ నుంచి వచ్చిన తెలుగుదేశం అభిమానులు.. పార్టీకి ఎంత విరాళం ఇచ్చారంటే - టీడీపీ పార్టీ నిధికి విరాళం
QATAR NRI TDP: దేశం దాటినా.. తెలుగుదేశంపై, చంద్రబాబుపై అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుందని నిరూపించారు ఖతార్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు. స్వదేశానికి వచ్చి.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. అదేవిధంగా పార్టీ నిధికి 15.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖతార్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణ, ఆయన సతీమణి లక్ష్మి, ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, విజయ్ భాస్కర్ దండ, కొడాలి సుధాకర్ ఆయన సతీమణి, వెంకప్ప భాగవతులతో పాటు పలువురు పాల్గొన్నారు. 15.5 లక్షల రూపాయలను పార్టీ నిధికి, తెలుగుదేశం కార్యకర్తల వైద్య సహాయ నిధికి అందించినందుకు ఖతర్ తెలుగుదేశం శాఖ సభ్యులకు పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర్ రావు, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబెర్ మలిరెడ్డి సత్యనారాయణ అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి: