ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pulses Cultivation Reduced in AP: నీటిమీద రాతలుగానే జగన్​ హామీలు.. ‘చిరు’సాయమూ కరవే! - రాగులు

Pulses Cultivation Reduced in AP: చిరుధాన్యాల వినియోగం రోజురోజుకి పెరుగుతున్నా.. మార్కెట్లో వాటి రేట్లు చుక్కలనంటుతున్నా.. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం కల్పిస్తామనే ముఖ్యమంత్రి జగన్‌ హామీలు.. నీటిమీద రాతలు గానే మిగిలిపోయాయి. మిల్లెట్‌ బోర్డు సైతం మొక్కుబడిగానే మిగిలిపోవడంతో.. రాష్ట్రంలో ఏటా చిరుధాన్యాల విస్తీర్ణం తగ్గిపోతుంది. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా చిరుధాన్యాలు పరిస్థితి తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Millets_Cultivation_Reduced_in_AP
Millets_Cultivation_in_AP

By

Published : Aug 15, 2023, 10:18 AM IST

Updated : Aug 15, 2023, 5:39 PM IST

Pulses Cultivation Reduced in AP: నీటిమీద రాతలుగానే జగన్​ హామీలు

Pulses Cultivation Reduced in AP: చిరుధాన్యాలు పండించే రైతులకు అండగా ఉంటానంటూ.. జులై 8న అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన పంటల బీమా విడుదల కార్యక్రమంలో రైతులకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం హామీలకు విలువ ఉన్నట్లు ఎక్కడా కన్పించడం లేదు. రాష్ట్రంలో ఏటికేడు తగ్గుతున్న చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి లెక్కలే దీనికి నిదర్శనం. మద్దతు ధరలంటే ఆదుకునేలా ఉండాలి. కానీ జగన్ ప్రకటించిన మద్దతు ధరలకు పంట అమ్ముకుంటే రైతులకు చివరకు నష్టాలే మిగులుతున్నాయి.

Millets and Grains: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాల పంపిణీ..!

2023 is the International Year of Cereals: 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినా.. రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహమూ లేదు. 20 ఏళ్ల నాటితో పోలిస్తే రాష్ట్రంలో జొన్న, రాగులు, సజ్జ, చిరుధాన్యాల సాగు 50 శాతం పైనే తగ్గింది. వైసీపీ అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి గణనీయంగా దిగజారింది. పెట్టుబడులు పెరిగి.. మద్దతు ధర సరిపోని పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగుపై రైతులు విముఖత చూపుతున్నారు.

ఆదుకొనేవి అపరాలే.. బహుళ ప్రయోజనాలిచ్చే పంటలుగా గుర్తింపు!

Parliamentary Approval For Millets Board:చిరుధాన్యాల బోర్డు ఏర్పాటుకు 2019 డిసెంబరులో చట్టసభల ఆమోదం లభించింది. 2020 నుంచి అమల్లోకి వచ్చింది. బోర్డు ఏర్పాటు సమయంలో బోలెడు లక్ష్యాలు నిర్దేశించారు. చిరుధాన్యాల సాగు రైతులకు ప్రోత్సాహం.. పరిశ్రమల అభివృద్ధికి దోహదపడటంతో పాటు అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్ రకాల అభివృద్ధి, ఆధునిక సేద్య సాగు విధానాలు, నిల్వ సౌకర్యాలు, అదనపు విలువ జోడింపు, జాతీయ మార్కెట్లతో అనుసంధానం తదితర అంశాలు ఈ లక్ష్యాల్లో ఉన్నాయి.

Millet Development Fund: ముఖ్యమంత్రి ప్రకటించిన మిల్లెట్ అభివృద్ధి నిధి ఏర్పాటు హామీ నేటికీ అమలుకే నోచుకోలేదు. నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో చిరుధాన్యాల ఉత్పత్తి క్రమేపి తగ్గతోంది. 2019-20 సంవత్సరంలో 0.22 లక్షల టన్నల్లో ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తి.. 2020-21 లో 0.19 లక్షల టన్నులకి.. 2021-22 లో 0.13 లక్షల టన్నులకి ఉత్పత్తి పడిపోయింది.

కొన్నేళ్ల వరకు చిరుధాన్యాల సాగులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేది. కర్నూలు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో సాగు అధికంగా ఉండేది. 2004-05లో కర్నూలు జిల్లాలో 2లక్షల 50వేల ఎకరాల్లో జొన్న, 38 వేల ఎకరాల్లో కొర్ర సాగు చేసేవారు. సామల సాగు విస్తీర్ణం విశాఖపట్నంలో 55 వేల ఎకరాలు ఉండేది. ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో సజ్జల సాగు ఎక్కువగా ఉండేది. రానురాను అన్ని చోట్లా సాగు విస్తీర్ణం తగ్గింది.

ఏ పంటకైనా కౌలు, ఎరువులు, పురుగుమందులు, తదితరాలన్నీ కలిపి ఎకరాకు కనీసం 25 వేల పెట్టుబడి తప్పనిసరిగా అవుతుంది. జొన్న మినహా.. ఇతర చిరుధాన్యాల దిగుబడి ఎకరాకు నాలుగు క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన గిట్టుబాటు ధర క్వింటాలుకు కనీసం 6 వేల రూపాయల పైనే ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో అలా ఉండటం లేదు.

చిరు ధాన్యాల ధరల మంట.. కొనలేని పరిస్థితిలో పేద, మధ్యతరగతి ప్రజలు

కేంద్రం ఈ ఏడాది రాగులకు 3వేల 846, జొన్నకు 3వేల 225 రూపాయల మేర ధర నిర్ణయించింది. సామ, కొర్ర, వరిగ తదితర చిరుధాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో 2వేల 500 చొప్పున నిర్ణయించిన మద్దతు ధరను ఇప్పటికి కూడా పెంచలేదు. ఈ లెక్కన అమ్మితే ఎకరానికి 15 వేల వరకు నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. రైతు అమ్మేప్పుడు చిరుధాన్యాలకు ధర దక్కడం లేదు. అమ్మాక మాత్రం పైపైకి వెళుతున్నాయి.

జనవరిలో కిలో రూ. 70 ఉన్న పచ్చజొన్న ధర.. ఇప్పుడు 100 రూపాయల వరకు చేరింది. ప్రాసెసింగ్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమూ దీనికి కారణం. రైతులకే సంబంధిత యంత్రాలను 30% రాయితీపై ఇస్తే.. సొంతంగా మిల్లింగ్ చేసి విక్రయించుకునే వీలుంటుంది. 2019 ముందు యాంత్రీకరణ కింద ఇచ్చినా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటి ఊసే లేకుండా పోయింది.

పోషకాల చిరుధాన్యాలు.. ఇలా చేసుకుంటే ఈజీగా తినేయొచ్చు

Famers Demand to Increase the Support Price: రాష్ట్రంలో కొన్ని రకాల చిరుధాన్యాల సాగు వివరాలను గమనిస్తే.. 2004-05 మధ్య జొన్న, రాగి, సజ్జ, కొర్ర, సామ, ఇతర చిరుధాన్యాలు 7 లక్షల 90వేల ఎకరాల్లో సాగు చేస్తే.. 2021-22 నాటికి వాటి సాగు 3 లక్షల 79 వేలకు పరిమితమైంది. 2022-23 నాటికి సాగు విస్తీర్ణం ఏకంగా 3 లక్షల 14 వేలకు పడిపోయింది. దీనికి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమని రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధర ప్రకటించి చిరుధాన్యాల సాగుని పెంచేలా .. చిరుసాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

Millets Boosts Children Growth : చిరుధాన్యాలతో చిన్నారులకు ఎంతో మేలు

Last Updated : Aug 15, 2023, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details