ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులిచింతలకు జలకళ.. దిగువకు నీటి విడుదల

By

Published : Oct 7, 2020, 7:04 PM IST

పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో జలాశయం నిండిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ఒక్క గేటు ఎత్తి 10 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు.

నిండుకండలా పులిచింతల.. ఒక్క గేటతో నీటి విడుదల
నిండుకండలా పులిచింతల.. ఒక్క గేటతో నీటి విడుదల

కొద్ది రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో పులిచింతల జలాశయం దాదాపుగా నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 45.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 9 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోందన్నారు.

ఒక్క గేటు ఎత్తి 10 వేల క్యూసెక్కులు విడుదల

ఒక గేటు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులను కేటాయించారు. వరదనీరు తగ్గితే తెరిచిన ఒక్క గేటుని కూడా మూసివేస్తామని జలాశయ అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

అహోబిలం.. ఆహా ఏమీ ప్రకృతి అందం!!

ABOUT THE AUTHOR

...view details