ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతల జలాశయం 15 గేట్లు ఎత్తి నీటి విడుదల

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు పులిచింతల జలాశయం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉద్ధృితి పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Pulichintala Reservoir
పులిచింతల జలాశయం

By

Published : Sep 27, 2020, 3:34 PM IST

ఎగువ నుంచి పెరిగిన వరద ప్రవాహంతో పులిచింతల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పులిచింతలకు 5 లక్షల 4వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా...15 గేట్ల ద్వారా 5 లక్షల 19 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడిచిపెడుతున్నారు. 13 గేట్లు 4 అడుగులు మేర, 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

మరో 12వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.03 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా... ప్రస్తుతం 173.45 అడుగుల నీటిమట్టానికి చేరింది. వరద పెరిగే అవకాశముందని.. ప్రజలను అప్రమత్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details