ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశాన వాటిక లేక.. నడిరోడ్డుపైనే మృతదేహంతో ధర్నా - pulichintala project people protest latest news

బ్రాహ్మణప్లలి దగ్గర పులిచింతల ప్రాజెక్ట్​ నిర్వాసితులు శ్మశాన వాటిక లేదని నిరసన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి మరణించగా.. మృతదేహాన్ని రోడ్డుపై శవాన్ని ఉంచి ధర్నా చేపట్టారు.

pulichintala project people protest on road
రోడ్డుపై బైఠాయించి ఆందోలన చేస్తున్న పులిచింతల ప్రాజెక్ట్​ ప్రజలు

By

Published : Oct 3, 2020, 9:36 PM IST

పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి దగ్గర పులిచింతల ప్రాజెక్ట్​ నిర్వాసితులకు స్థలాలు కేటాయించినా... శ్వశాన వాటికను ఏర్పాటు చేయలేదు. మరోవైపు.. అదే ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోయారు.

అంత్యక్రియలకు చోటు లేక.. కుటుంబీకులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. చివరికి.. అయ్యప్ప స్వామి గుడి సమీపంలో శవాన్ని నడి రోడ్డుపై పెట్టి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చ జెప్పి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details