ఎగువ నుంచి వరద నీరు క్రమంగా తగ్గడంతో కృష్ణమ్మ శాంతించింది. పులిచింతల ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 6 గేట్లను ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కులను కేటాయించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.58 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద తీవ్రతను బట్టి మరికొన్ని గేట్లు ఎత్తడం లేదా దించటం చేస్తామని అధికారులు తెలిపారు.
శాంతించిన కృష్ణమ్మ.. పులిచింతల ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద - pulichintala project latest news
పులిచింతల ప్రాజెక్ట్‌కు.. పైనుంచి వచ్చే వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. పరిస్థితిని బట్టి గేట్లు ఎత్తడం, దించడం చేస్తామని అధికారులు తెలిపారు.
క్రమంగా తగ్గుతున్న వరదనీరు