గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి ఇన్ఫ్లో 26 వేల క్యూసెక్కులు ఉండగా.. మూడు గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
PULICHINTALA: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - latest news in guntur district
విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా.. పులిచింతల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. ప్రస్తుతం 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టు
Last Updated : Jul 23, 2021, 7:21 AM IST