ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్ల సమస్యను పట్టించుకోని నేతలు.. చివరకు - గుంటూరులో వైకాపా కార్పొరేటర్‌ రోడ్డు ప్రమాదం

Roads Condition: రోడ్ల సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు పలుసార్లు ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. చివరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రజాప్రతినిధే ఎదుర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 1, 2022, 4:52 PM IST

Roads Condition In Guntur: గుంటూరు నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు మొర పెట్టుకున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు కష్టాలను స్వయంగా అనుభవించాల్సి వస్తోంది. ప్రజల ఫిర్యాదులను పట్టించుకోని నేతలకు చివరికి అధ్వానంగా తయారైన రోడ్లు వారికే ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. బైక్‌పై వెళ్తున్న ఓ వైకాపా కార్పొరేటర్‌.. రోడ్లపై గోతుల వల్ల కిందపడిపోవడం చర్చనీయాంశంగా మారింది. 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ అబిద్‌ బాష పొన్నూరు రోడ్డులో వెళ్తుండగా గుంతలో పడిపోయారు. ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. కార్పొరేటర్‌ వాహనానికి నెంబరు ప్లేట్ కూడా లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

గుంటూరులో ధ్వంసమైన రోడ్లు

ABOUT THE AUTHOR

...view details