ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలి జిల్లా ఆసుపత్రిలో మానసిక దివ్యాంగులకు తిప్పలు - tenali latest news

తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మానసిక దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం వస్తుంటారు. వైద్యులు అందుబాటులో లేకపోవటంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన ప్రతీసారి వందల రూపాయలు ఖర్చు అవటం తప్ప.. పని జరగట్లేదని బాధితులు చెబుతున్నారు.

Tenali District Hospital
తెనాలి జిల్లా ఆసుపత్రి

By

Published : Apr 24, 2021, 12:46 PM IST

తెనాలి జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగుల వైద్యుడు అందుబాటులో లేక బాధితుల ఇబ్బందులు

గుంటూరులోని తెనాలి జిల్లా ఆసుపత్రిలో మానసిక దివ్యాంగుల వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సదరం పరీక్షలు జరగడం లేదు. గతంలో ప్రతి గురు, శుక్రవారాల్లో పరీక్షలు చేయించుకుని బాధితులు సర్టిఫికెట్​ని పొందేవారు. నాలుగు వారాలుగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పరీక్షల కోసం వచ్చిన వారు వెనుదిరుగుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పని జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసికంగా కుంగిపోతున్న తాము.. శారీరకంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.

పట్టించుకునే నాధుడే లేడు..

వివిధ ప్రాంతాల నుండి ఉదయం తెనాలి జిల్లా ఆసుపత్రికి వస్తే మధ్యాహ్నం వరకు మానసిక వైద్యుల గది వద్ద వేచి చూస్తున్నామని బాధితులు చెబుతున్నారు. బయటికి వెళ్లి ఆహారం తిందామంటే.. వైద్యులు ఎప్పుడు వస్తారో తేలిక.. ఎవరూ లేరని వెళ్లిపోతారేమోననే భయంతో అక్కడే కూర్చున్నామని పేర్కొన్నారు. కనీసం సమాచారం ఇచ్చేవారు లేరన్నారు.

జీజీహెచ్​కి లేఖ రాశాను..

గతంలో ఈ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్​ను కొవిడ్ కారణంగా గుంటూరు ఆసుపత్రిలో పని చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో తెనాలిలోని మానసిక దివ్యాంగుల వైద్యుల పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టు భర్తీ చేయాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి లేఖ రాశాను. తిరిగి అక్కడ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే వైద్యులను నియమిస్తాం. బాధితులు ఇబ్బంది పడకుండా చూస్తాం. -డా. సనత్ కుమారి, తెనాలి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్


ఇదీ చదవండి:ఐదు కొవిడ్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details