అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న గుంటూరులో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. రెడ్ జోన్ ప్రకటిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. వీటిని సిటీ ఆస్పత్రికి చెందిన డేగల ప్రబాకర్ అందించారు. కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేలా ఈ రక్షణ సూట్లను రూపొందించామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో బ్లీచింగ్ పౌడర్‌తో పాటు లైజాల్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు అందజేత - lockdown
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అత్యవసర సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ రక్షణ సూట్లను అందించారు. రెడ్ జోన్లలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల అందజేత