ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో గుంటూరు జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని 85 ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల వైద్యులతో ప్రత్యేక అధికారి, కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ -19 ఆసుపత్రులుగా మారుస్తున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఆస్పత్రుల పరిధిలో వైద్యులు, సిబ్బంది, బెడ్లు, వెంటిలేటర్స్ వివరాలు అందజేయాలని ఆదేశించారు.
కోవిడ్-19 ఆస్పత్రులుగా పైవేటు వైద్యశాలలు - కోవిడ్-19 ఆసుపత్రులుగా పైవేటు వైద్యశాలలు
గుంటూరులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నందున.... ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కోవిడ్-19 కేసులకు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయంచింది. 85 ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల ఆస్పత్రుల వైద్యులతో ప్రత్యేక అధికారి, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్పత్రుల పరిధిలో వైద్యులు, సిబ్బంది, బెడ్లు, వెంటిలేటర్స్ వివరాలు అందజేయాలని ఆదేశించారు.
![కోవిడ్-19 ఆస్పత్రులుగా పైవేటు వైద్యశాలలు provate hospitals at covid hospitals in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6821922-721-6821922-1587058727322.jpg)
కోవిడ్-19 ఆసుపత్రులుగా పైవేటు వైద్యశాలలు