ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అచ్చెన్న కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన తెలుగు తమ్ముళ్లు - రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు

తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర రెడ్డి అరెస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టాయి.

protests by tdp ranges around the state
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసనలు

By

Published : Jun 13, 2020, 2:48 PM IST

Updated : Jun 13, 2020, 3:34 PM IST

ప్రభుత్వ తీరుపై.. తెదేపా నాయకులు నిరసన తెలిపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు.

విజయనగరం జిల్లా..

అచ్చెన్నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ.. విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా నేతలు నిరసన చేశారు. సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కక్ష సాధింపు పాలనను ముఖ్యమంత్రి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కర్నూలు జిల్లాలో..

అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూలులో తెదేపా బీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కడప జిల్లాలో..

అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నారని.. ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని కడప జిల్లా తెదేపా నాయకులు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని తనయుడు చింతమనేని ప్రభాకర్ లనూ అరెస్టు చేయడం సరికాదని చెప్పారు. ప్రతిపక్షం ఉండకూడదనే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం.. తెదేపా అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ముందు తెదేపా నాయకులు నిరసన చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు. వైకాపా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న అచ్చెన్నాయుడిని అడ్డుకోలేకే, అధికారం ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అచ్చెన్నను వెంటనే విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ధర్నాలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. పుత్తూరులో కూడా నిరసనలు మిన్నంటాయి.

శ్రీకాకుళం జిల్లా...

మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ పరిధిలో తెదేపా నేతలు నిరసనలు చేశారు. కోట బొమ్మాళిలో ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. సంతబొమ్మాళిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

ప్రకాశం జిల్లాలో..

ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. అచ్చెన్నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య అన్నారు. ఆయనకు మద్దుతు తెలిపిన చింతమనేని ప్రభాకర్‌ ను కూడా అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు. అసెంబ్లీసమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలు నిలదీస్తారన్న భయంతోనే అచ్చెన్నను అరెస్టు చేశారని ఆరోపించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారంటూ జంగారెడ్డిగూడెంలో తేదేపా బీసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా పూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని.. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏడాది పాలనపై అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తారని ముందుగానే అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని ఆరోపించారు.

గుంటూరు జిల్లాలో..

దేశంలోని ముఖ్యమంత్రలు అందరూ కోవిడ్- 19 పై దృష్టి సారిస్తే.. ఏపీ సీఎం జగన్ మాత్రం కక్షసాధింపు చర్యులపైన దృష్టి సారించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ గుంటూరు తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారు. బలమైన నాయకులను హింసించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

Last Updated : Jun 13, 2020, 3:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details