Protests Across the State Condemning Chandrababu Arrest:స్కిల్ డెవలప్మెంట్ కేసులో(Skill Development Case)చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు తాడికొండ అడ్డరోడ్డులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షల్లో రాజధాని రైతులు పాల్గొన్నారు. సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ ఆధ్వర్యంలోరిలే నిరాహార దీక్షచేపట్టారు. బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష 10వ రోజుకు చేరుకుంది. ఎన్యీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ మహిళ విభాగం ఆధ్యర్యంలో 10వ రోజు దీక్షలు కొనసాగుతున్నారు. నందిగామలో తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలో సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ నినాదాలుచేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మహిళలు దీక్ష చేపట్టారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును(Chandrababu Arrest) ఖండిస్తూ నంద్యాలలో మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. కర్నూలు దీక్షలో 4 వేలమందికి పైగా పాల్గొన్నారు. మదనపల్లి టీడీపీ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్ష శిబిరంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో తెలుగుదేశంరిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కడప మండీబజార్‌లో టీడీపీ శ్రేణులు దీక్షలు చేపట్టారు. కమలాపురం తెలుగుదేశం కార్యాలయం వద్ద దీక్షలో భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో దీక్షలు కొనసాగుతున్నాయి. బాబును వెంటనే విడుదల చేయాలని చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగుదేశం నాయకులు పాదయాత్ర నిర్వహించారు. గంగవరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కీలపట్లలోని కోనేటి రాయస్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగించారు. రాయదుర్గంలో మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష(Initiation of protest) చేపట్టారు. సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురంలో దీక్షలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధినేతను విడుదల చేసేంత వరకు ఆందోళన ఆపేదే లేదని నేతలు తేల్చి చెప్పారు.