Protests Across State Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన దీక్షలు చేపట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడమేగాక.. గృహ నిర్బంధించారు.
TDP Leaders and Activists Protests: పట్టు వదలని టీడీపీ నేతలు.. శిబిరాల్లోనే వినాయకుడి పూజలు
ఉమ్మడి కృష్ణా: విజయవాడలో కనకదుర్గమ్మకు సారె సమర్పించేందుకు బయలుదేరిన ఉమ్మడి కృష్ణా జిల్లాల నేతలను ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధించారు. అమ్మవారి గుడికి బయలుదేరిన మాజీమంత్రి కొల్లు రవీంద్రను విజయవాడలో పోలీలు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద బాబు రాజేంద్రప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్‌లను అరెస్ట్ చేశారు. విజయవాడలోని వినాయకుడి గుడివద్దకు చేరుకున్న దేవినేని ఉమ, బుద్ధ వెంకన్నలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరువురికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం నేతలను గృహనిర్బంధించడంపై లోకేశ్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలోని మిల్క్‌సెంటర్‌లో శ్రీ అభయాంజనేయస్వామి గుడివద్ద పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గుడివాడలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నందిగామలో ఏడోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. జగ్గయ్యపేటలో మహిళలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గన్నవరంలోనూ దీక్షలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సంఘీభావం తెలిపారు.
మేదరమెట్ల నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయం వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల నుండి శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం వరకు తెదేపా శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. పల్నాడు జిల్లా ఓర్వకల్లులో గంగాదేవి పొంగళ్లు నివేదించారు.
గుడివాడలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వేమవరం శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో అమ్మవారికి వెనిగండ్ల రాము ప్రత్యేక పూజలు చేశారు. నందిగామలో ఏడోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. జగ్గయ్యపేటలో మహిళలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గన్నవరంలోనూ దీక్షలు కొనసాగుతున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా పొన్నూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఎమెల్సీ పంచుమర్తి అనురాధ సంఘీభావం తెలిపారు. మేదరమెట్ల నుంచి శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయం వరకు చంద్రబాబు అభిమానులు పాదయాత్ర నిర్వహించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకుల ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని అర్థనగ్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ వినూత్నంగా టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహం చుట్టూ పొర్లుదండాలు పెట్టి ధర్నా చేశారు.
ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల సునీత కాన్వాయను పోలీసులు అడ్డుకున్నారు. కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమానికి వెళ్తుండగా ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవ సర్కిల్లో పోలీసులు అడ్డగించారు. అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలో పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కదిరిలో జిల్లా నాయకులు రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పట్టణములోని జాతీయ రహదారి 42 పై ఉన్న నానా దర్గాలో టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.