గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో.. తమ సమస్యలపై గ్రామస్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఊళ్లో రహదారిపై గాడిదల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు.. ఓ గాడిదను తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయంలో కట్టేశారు. గాడిదల విచ్చలవిడి సంచారంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
గాడిదల సంచారంపై గ్రామస్థుల వినూత్న నిరసన - donkey protest news
ఎర్రబాలెం గ్రామంలో గాడిదల సంచారంపై స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఓ గాడిదను తెచ్చి పంచాయతీ కార్యదర్శి ఛాంబర్ ఎదుట కట్టేసిన స్థానికులు.. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
protest with donkey in yerrabalem in guntur district