ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తే ఊరుకోబోం' - ఏపీలో రాజధాని వార్తలు

మండలి ఛైర్మన్ షరిఫ్​పై వైకాపా నేతల ప్రవర్తనను నిరసిస్తూ... గుంటూరు జిల్లాలో తెదేపా శ్రేణులు ఆందోళనలు చేశారు.

గుంటూరులో తెదేపా విన్నూత్న ఆందోళన
గుంటూరులో తెదేపా విన్నూత్న ఆందోళన

By

Published : Jan 23, 2020, 10:39 PM IST

'రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తే ఊరుకోబోం'

మండలి ఛైర్మన్ షరిఫ్‌పై అనుచితవ్యాఖ్యలు చేసిన వైకాపా నేతల తీరును నిరసిస్తూ... తెదేపా ఆధ్వర్యంలో గుంటూరులో ఆందోళన చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. గాంధీజీ విగ్రహానికి, షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాజధాని అమరావతికి ప్రజల మద్దతు కోరుతూ గులాబీ పూలు అందజేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

రాజధాని రైతుల త్యాగాలను అపహాస్యం చేసేలా ప్రభుత్వ పెద్దలు, వైకాపా నేతలు మాట్లాడొద్దని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పంచుమర్తి అనురాధ, నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. రాజధాని అమరావతి విషయంలో రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు. తుళ్లూరు మహాధర్నా శిబిరంలో నిరాహారదీక్షలో కూర్చొన్న పలువురు రైతులు, మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details