గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు. రైతులకు మద్దతుగా అఖిలపక్ష పార్టీ నాయకులు ధర్నా చేశారు. కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిని ఇక్కడే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక మాట....అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని అఖిలపక్ష నేతలు విమర్శించారు. అమరావతిని ఇక్కడే కొనసాగిస్తామని ప్రకటించే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. రాజధానిపై స్పందించని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతులకు మద్దతుగా అఖిలపక్ష నేతల ధర్నా - news in amaravathi
రాజధాని వికేంద్రీకరణ ప్రకటనను నిరసిస్తూ మంగళగిరి మండలం నిడమర్రులో రైతులు, అఖిలపక్ష పార్టీ నాయకులు ధర్నా చేశారు.
"రాజధాని రైతులకు మద్దతుగా అఖిలపక్షనేతలు ధర్నా"