ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేటలో వినూత్న నిరసన...వెనుకకు నడుస్తూ ర్యాలీ - ap amaravathi news

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌తో ర్యాలీలు చేశారు.

రాజధానులకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన
రాజధానులకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన

By

Published : Jan 21, 2020, 11:43 PM IST

రాజధానులకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో వెనుకకు నడుస్తూ నిరసన

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి చిలకలూరిపేట జెఎసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వెనుకకు నడుస్తూ మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. 12వ రోజు జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని ప్రత్తిపాటి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details