అమ్మఒడిని వర్తింపచేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కార్మికులకు అమ్మఒడి, విద్యాదీవెన పథకాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖామంత్రి, విద్యాశాఖ మంత్రి డౌన్ డౌన్ అంటూ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అమ్మఒడి పథకం వర్తింపచేయాలని మున్సిపల్ కార్మికుల ఆందోళన - protest of municipal workers at narasaraopeta news
అమ్మఒడి పథకం వర్తింపచేయాలంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
మున్సిపల్ కార్మికుల ఆందోళన
పశ్చిమ గుంటూరు సీఐటీయూ అధ్యక్షుడు సాల్మన్ ఆందోళనలో పాల్గొని.. మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు అమ్మఒడి, విద్యాదీవెన పథకాలు వర్తించకుండా చేయటం సరికాదన్నారు. కార్మికులకు వచ్చే అరకొర జీతాలతో పిల్లలను చదివించుకోలేరని.. వారికి కూడా పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సభ్యులు, ప్రభుత్వ కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్