ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయాలి'

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయాన్ని తెదేపా నేతలు ముట్టడించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

protest-in-thenali-to-demand-distribution-homes-for-people
తెనాలి మున్సిపల్ కార్యాలయం ముట్టడి

By

Published : Oct 29, 2020, 6:01 PM IST

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు పంపిణి చేయాలంటూ... గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. టిడ్కో గృహ సముదాయాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. లబ్ధిదారులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో.. గేటు వద్దే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆలపాటి రాజా ఆందోళన విరమించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి

బాపట్లలో మహిళ హల్​చల్​...రాళ్లతో బస్సుపై దాడి

ABOUT THE AUTHOR

...view details