సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ... ఎమ్మెల్సీ రామకృష్ణ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరులోని తన నివాసంలో చేపట్టిన ఈ దీక్షకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మద్దతు పలికారు.
వైకాపా ప్రభుత్వం వచ్చిన వారంలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి.. ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దీర్ఘకాలిక ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.