శాఖమూరు స్మృతి వనంలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాలంటూ అమరావతి ఎస్సీ ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడకు తరలించవద్దంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం ఎస్సీలపై గౌరవంతో రాజధానిలో 30 ఎకరాలు కేటాయించి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 శాతం పనులు సైతం పూర్తి చేశారని ఐకాస నేతలు చెప్పారు. ఓ వైపు రాజధానిని తరలిస్తున్నారని.. ఇప్పుడు స్మృతి వనాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తుళ్లూరులో ఎస్సీ ఐకాస నాయకుల ధర్నా - ambedkar statue news in guntur dst
అంబేడ్కర్ విగ్రహాన్ని శాఖమూరు స్మృతి వనంలోనే నిర్మించాలని అమరావతి ఎస్సీ ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో ధర్నా నిర్వహించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు గత ప్రభుత్వంలో భూమిపూజ చేసి 30 శాతం పనులు పూర్తి చేశారని నేతలు తెలిపారు.
protest in guntur dst thullor about ambedkar statue