గుంటూరు జిల్లా చెరుకుపల్లి వద్ద జాతీయ రహదారిపై దళిత సంఘాల నేతలు రాస్తారోకో చేశారు. గుళ్లపళ్లి ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న డా. బీఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానిస్తూ.. గుర్తుతెలియని వ్యక్తులు వీడియోలు తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలను చూసిన దళిత సంఘాల నాయకులు.. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలంటూ గుళ్లపల్లిలో ఆందోన చేశారు.
'అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి' - guntur district latest concern
డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అవమానపరిచారంటూ గుంటూరు జిల్లా గుళ్లపల్లిలో దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గుళ్లపల్లిలో దళిత సంఘాల నేతలు ఆందోళన
విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని జాతీయ రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి.